![]() |
![]() |

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -280 లో.....ప్రేమ ఫొటోస్ గురించి ఎదురింటి వాళ్ళకి ఎలా తెలిసిందోనని కనుక్కోవడానికి తిరుపతిని భద్రవతి ఇంటికి పంపిస్తుంది నర్మద. మరొకవైపు ధీరజ్ వంక ఐశ్వర్య అలాగే చూస్తుంటే.. అది ప్రేమ చూసి కుళ్ళుకుంటుంది. ధీరజ్ ని డ్రింక్ చెయ్యమని ఫ్రెండ్స్ ఫోర్స్ చేస్తుంటే నేను ప్రేమ వచ్చామురా మళ్ళీ సేఫ్ గా ఇంటికి వెళ్ళాలి కదా వద్దని ధీరజ్ అంటాడు.
మరొకవైపు ప్రేమని తన ఫ్రెండ్స్ డ్రింక్ చెయ్యమని ఫోర్స్ చేస్తుంటే వద్దని అంటుంది. ఆ తర్వాత తిరుపతి ఎదురింట్లోకి వెళ్ళగానే ఎందుకు వచ్చావని అందరు కోప్పడతారు. మొన్న ప్రేమ విషయంలో వాళ్లకు సపోర్ట్ చేసావ్.. అలాంటి వాడికి ఇక్కడ ఏం పని అని భద్రవతి కోప్పడుతుంది. రామరాజు బావ ప్రేమ అలా వేరొకరితో ఫొటోస్ లో ఉన్నా కూడా ప్రేమని ఒక్క మాట కూడ అనలేదు. మీరే అనవసరంగా వచ్చి గొడవ చేసారని తిరుపతి అంటాడు. అనవసరంగా ఏం రాలేదు.. ఆధారం తోనే వచ్చామని విశ్వ అంటాడు. అలాంటి గొడవకి వెళ్ళేటప్పుడు ముందు వెనక చూసుకోవాలి కదా అని తిరుపతి అంటాడు. మాకు వాళ్ళ వియ్యంకురాలు భాగ్యలక్ష్మి చెప్పిందని విశ్వ చెప్పగానే తిరుపతి షాక్ అవుతాడు.
ఆ తర్వాత నర్మద దగ్గరికి తిరుపతి వెళ్లి అక్కడ తెలుసుకున్న నిజం చెప్తాడు. దాంతో నర్మద కూడా షాక్ అవుతుంది. ఆ తర్వాత ప్రేమకి తన ఫ్రెండ్స్ కూల్ డ్రింక్ లో మందు ఇస్తారు. ధీరజ్ తో ఐశ్వర్య డ్యాన్స్ చేస్తుంటే ప్రేమ చూడలేక కోపంగా ఐశ్వర్యని పక్కకి లాగి తను ధీరజ్ తో డ్యాన్స్ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |